English provebs

English proverbs in Telugu ,English proverbs explained in Telugu

  • Patient waiters are no losers

             Proverb Explanation in Telugu     
           పేషెంట్ వెయిటర్స్ ఆర్ నో లూజర్స్... అంటే ఓపికగా వేచి ఉండేవారు నష్టపోరు అని అర్థం. ఓపిక, సహనం మనిషిని విజయునిగ తీర్చిదిద్దుతాయని చెప్పటానికి ఈ సామెతను వాడతారు. మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ ల క్ష్యం నెరవేర్చటానికి ఓపికతో ముందుకు వెళ్లటం చాలా అవసరం. అనేక అవాంతరాలు ఎదురైనప్పుడు మనం తొందరపడితే మనం అనుకున్నది సాధించలేం. అందుకే ఓపికగా ఉన్నవారు నష్టపోరు అంటారు.




  • Jocular slanders often proves serious injuries
         proverb explanation in Telugu
         జోక్యులర్ స్లాండర్స్ ఆఫెన్ ప్రూవ్స్ సీరియస్ ఇన్‌జురీస్. అంటే తమాషా గా చెప్పిన చాడీలే తీవ్రమైన గాయాలవుతాయి అని అర్థం. చిన్న చిన్న చాడీలు కూడా తీవ్రమైన ఇబ్బందులు కలుగచేస్తాయని చెప్పటానికి ఈ సామెతను వాడతారు.


చాలా మంది ఇతరుల్ని ఆటపట్టించాలని పెద్దలకు చాడీలు చెప్తుంటారు. ఏదో సరదాకి చెప్తున్నాం అనుకుంటారు. కానీ సరదాకు చెప్పినవి కూడా ఒకొక్క సారి చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకు కూడా వస్తుంటాయి. కాబట్టి సరదాకు కూడా చాడీలు చెప్పకూడదు.

  •   He who asks a question is a fool for a minute; he who  does  
        not remains forever
        proverb explanation in Telugu

హి హూ ఆ‌స్క్‌స్ ఎ క్వశ్చన్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ ఎ మినిట్; హి హూ డజ్‌నాట్ రిమైన్స్ ఫర్ ఎవర్.
అంటే ఏదైనా ప్రశ్న అడిగిన వ్యక్తి ఒక నిమిషం మాత్రమే అవివేకిగా ఉంటాడు. అడగని వ్యక్తి ఎల్లకాలం అవివేకిగానే ఉంటాడు అని అర్థం. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలని చెప్పటానికి ఈ సామెతను వాడతారు. కొంతమంది తమకు తెలియని విషయం గురించి ఎవరినైనా అడగటానికి సిగ్గుపడతారు.

అవతలివాళ్లు తమకు ఏమీ తెలియదని అనుకుంటారని ప్రశ్నలు వేయటానికి ఇష్టపడరు. అయితే ప్రశ్నించటం అనేది జ్ఞానానికి మొదటి మెట్టు. ప్రశ్నించకపోతే ఎప్పటికీ ఆజ్ఞానంలోనే ఉండిపోతాం. ఉదాహరణకు క్లాసులో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల్లో అర్థం కాని వాటిని విద్యార్థులు తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. అంతేతప్ప ఎవరో ఏదో అనుకుంటారని ప్రశ్నించకపోతే ఆ విషయాలు ఎప్పటికీ తెలియవు.


English proverbs with meaning ,
English proverbs Telugu explanation  

  •    Giving is the secret of a healthy life
           proverb explanation in Telugu
గివింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎ హెల్దీ లైఫ్... అంటే ‘ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం ఇచ్చేగుణమే’ అని అర్థం. దానం గురించి చెప్పటానికి ఈ సామెతను వాడతారు. సాధారణంగా దాన ధర్మాలు చేసేవారు ఆరోగ్యంగా ఉండటం చూస్తూ ఉంటాం. వారు ఆరోగ్యంగా జీవించటానికి ఆ దానగుణమే ప్రధాన కారణం కావచ్చు. అందుకే చాలామంది ఉన్నదాంట్లో తోటివారికి సహాయం చేయాలంటుంటారు.

ఈ గుణం మనిషి ఆరోగ్యంగా జీవించటానికి కారణం అవుతుంది. ఇచ్చే గుణం ఉన్న వారిలో స్వార్థపరమైన ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటానికి అవకాశం ఉండదు. ఉన్నదానితో తృప్తిగా జీవితాన్ని గడపటానికి